నంద్యాల(కర్నూలు జిల్లా) : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం జరగనున్న ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, ఒక వేళ విఫలమైతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నంద్యాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. ఎంసెట్‌కు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని విద్యార్ధులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు.