
ఎమ్మెల్యే భూమాకు స్వల్పంగా గుండెపోటు
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం రాత్రి స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు.
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం రాత్రి స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన క్రాంతినగర్‌లో ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు బాణసంచా కాల్చడంతో వచ్చిన పొగ వల్ల శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అలాగే ఐఎంఏ సమావేశంలో పాల్గొని ఇంటికి వెళ్లారు.
ఆ తర్వాత కూడా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులు ఆయనకు ఈసీజీ తీసి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు గంట పాటు చికిత్స అందించిన అనంతరం ఆయన కోలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. భూమా మీడియాతో మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు.