టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రజాస్వామ్యం ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని.. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుతో
ఎల్.ఎన్.పేట: టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రజాస్వామ్యం ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని.. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుతో ఇది నిజమని తేలిందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటుహక్కును కూడా వినియోగించుకోకుండా పోలింగ్ కేంద్రం వద్దనే అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధిస్తున్నారని.. లేదంటే దాడులు చేసి మారణహోమం సృష్టస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దగ్గరగా వస్తున్నప్పుడు నన్ను తాకద్దు.. దూరంగా ఉండి మాట్లాడండి అనడం నేరంగా వక్రీకరించి అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తున్న ప్రభుత్వం ఇందుకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదంతా చేస్తున్నారని అన్నారు. నెల రోజులు క్రితం తెలంగాణ లో ఓటుకు కోట్లు ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏకంగా అరెస్టులు చేసి అరాచకం సృష్టిస్తూ ప్రజలను భయానికి గురిచే స్తున్నారన్నారు.