కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి భారీగా పోలీసులను మోహరించారు. జిల్లాలోని నంద్యాల పురపాలక సమావేశంలో జరిగిన ఘర్షణకు భూమానే ప్రధాన కారణమని టీడీపీ తప్పుడు ఫిర్యాదు చేయడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. తొలుత ఆ సమావేశంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వావాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఒక పద్దతి ప్రకారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశంలో రసాభసాగా మారి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
టీడీపీ కౌన్సిలర్లు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై దాడి చేసినా.. జిల్లాలో టీడీపీ ఆధిపత్య ధోరణి కాస్తా ఘర్షణకు కారణమైంది. అధికార టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సహా ఇద్దరికి గాయాలయ్యాయి. చర్చ లేకుండా తీర్మానాలు ఆమోదిస్తుడడంతో వైఎస్సార్ సీపీ కౌన్సెలర్లు అభ్యంతరం చెప్పారు. వైఎస్సార్ సీపీ సూచనను చైర్మన్ పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేకుంది. టీడీపీ నాయకులు కుర్చీలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గన్ మెన్ కూడా గాయపడ్డాడు. అయితే సమావేశంలో జరిగిన ఘర్షణకు భూమా నాగిరెడ్డే కారణమని టీడీపీ తప్పుడు కేసులు బనాయించేందుకు యత్నాలు చేస్తోంది.