
నంద్యాల కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల కౌన్సిల్ సమావేశం ఘర్షణ చోటు చేసుకుంది. అధికార టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సహా ఇద్దరికి గాయాలయ్యాయి. చర్చ లేకుండా తీర్మానాలు ఆమోదిస్తుడడంతో వైఎస్సార్ సీపీ కౌన్సెలర్లు అభ్యంతరం చెప్పారు.
వైఎస్సార్ సీపీ సూచనను చైర్మన్ పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేకుంది. టీడీపీ నాయకులు కుర్చీలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గన్ మెన్ కూడా గాయపడ్డాడు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు.