అమ్మ ఆశయాల కోసం పనిచేస్తా:అఖిలప్రియ | MLA akhila priya meets ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

అమ్మ ఆశయాల కోసం పనిచేస్తా:అఖిలప్రియ

Oct 27 2014 5:30 PM | Updated on May 29 2018 4:15 PM

అమ్మ ఆశయాల కోసం పనిచేస్తా:అఖిలప్రియ - Sakshi

అమ్మ ఆశయాల కోసం పనిచేస్తా:అఖిలప్రియ

తన తల్లి భూమా శోభానాగిరెడ్డి ఆశయాల కోసం పనిచేస్తానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా అఖిలప్రియ తెలిపారు.

హైదరాబాద్: తన తల్లి భూమా శోభానాగిరెడ్డి ఆశయాల కోసం పనిచేస్తానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా అఖిలప్రియ తెలిపారు. తనపై వైఎస్సార్ సీపీతో పాటు, ఆళ్లగడ్డ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె స్పష్టం చేశారు.  సోమవారం లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తండ్రి నాగిరెడ్డితో మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. అమ్మ ఆశయాలు కోసం పని చేస్తానని ఆమె తెలిపారు. ఆళ్లడగ్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అఖిలప్రియ అన్నారు. ఈ అవకాశం కల్పించిన జగన్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఎమ్మెల్యేగా అఖిలప్రియ ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ భూమా నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, శోభా మరణం ఇప్పటికీ బాధగానే ఉందని భర్త నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement