
భూమా నాగిరెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్
నిమ్స్లో చికిత్స పొందుతున్న నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
హైదరాబాద్ : నిమ్స్లో చికిత్స పొందుతున్న నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైఎస్ జగన్ ఆరా తీశారు. భూమా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.