హైదరాబాద్: ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులను దూషించారంటూ భూమాపై కేసులు నమోదైన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ సబ్ జైల్లో ఉన్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించనున్నారు.