హామీలపై నిలదీస్తామనే మా నేతలపై కేసులు : జ్యోతుల | TDP False cases on ysr congress party leaders | Sakshi
Sakshi News home page

హామీలపై నిలదీస్తామనే మా నేతలపై కేసులు : జ్యోతుల

Published Mon, Nov 17 2014 12:05 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

హామీలపై నిలదీస్తామనే మా నేతలపై కేసులు : జ్యోతుల - Sakshi

హామీలపై నిలదీస్తామనే మా నేతలపై కేసులు : జ్యోతుల

అన్నవరం : ఎన్నికల హామీలను అమలు చేయని మోసంపై ప్రజల తరఫున నిలదీస్తామన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆదివారం ఆయన విశాఖపట్నం వెళుతూ సత్యదేవుని తొలిపాంచా వద్ద సత్యదేవునికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మొన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని హత్య కేసుతో అరెస్టు చేశారని, నిన్న పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథిపై కేసులు బనాయించారని ఆరోపించారు. ఎన్ని విధాలుగా భయభ్రాంతులను చేసినా ప్రభుత్వ వైఫల్యాలను జగన్ నాయకత్వంలో శాసనసభలో నిలదీసి తీరతామని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి, కొండపల్లి అప్పారావు, దడాల సతీష్, రాయి శ్రీనివాస్, బీఎస్‌వీ ప్రసాద్, వెదురుపాక మూర్తి, బొబ్బిలి వెంకన్న, తాటిపాక కృష్ణ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement