నంద్యాల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘తండ్రిలా అఖిలప్రియకు అండగా ఉంటా’
Mar 12 2017 1:50 PM | Updated on Oct 30 2018 4:15 PM
-భూమా హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి : నంద్యాల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కర్నూలు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని, ఇంతలోనే విషాద వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని ముఖ్యమంత్రి అన్నారు.
భూమా నాగిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉందని అన్నారు. భూమా మృతి వ్యక్తిగతంగా తనకు, తెలుగుదేశం పార్టీకి, కర్నూలు జిల్లా ప్రజలకు తీరని లోటని అన్నారు. భూమా కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు భూమా ఎనలేని కృషి చేశారని, కొద్ది రోజుల క్రితమే జిల్లా నాయకులతో వచ్చి తనను కలసి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. భూమా కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. తండ్రి స్థానంలో తానుంటానని, అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు ధైర్యం చెప్పారు. భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
Advertisement
Advertisement