
భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ
కర్నూలు: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాగలమర్రి మండలం గొడిగనూరులో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ గొడవల్లో కానిస్టేబుల్ సహా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సీసీ రోడ్డు పనుల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాలో భూమాకు శిల్పా వర్గీయులకు ఆధిపత్య పోరు నడుస్తుంది. తాజాగా గంగుల వర్గీయులతో భూమా గొడవలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీలో భూమా చేరికను మొదటి నుంచి గంగుల, శిల్పా వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.