
‘వారి సలహా మేరకే పార్టీ మారాం’
హైదరాబాద్: ప్రజాభీష్టం మేరకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరామని గంగుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన కుమారుడు గంగుల నాని, మద్దతుదారులతో కలిసి ఆయన బుధవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీలో ప్రజా సమస్యలపై చర్చించడం లేదని విమర్శించారు.
భూమా నాగిరెడ్డిని టీడీపీలో చేర్చుకోవద్దని చంద్రబాబును కోరినా పట్టించుకోలేదని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందని, పార్టీలో గౌరవం ఉంటుందని తనను బుజ్జగించే ప్రయత్నం చేశారని చెప్పారు. పలుమార్లు మద్దతుదారుల అభిప్రాయంగా కోరగా టీడీపీని వదిలిపెట్టాలని తనకు సలహాయిచ్చారని తెలిపారు. వారి అభీష్టం మేరకు తమ కుటుంబం వైఎస్సార్ సీపీలోకి వచ్చిందని వివరించారు.
సంబంధిత కథనాలు:
ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదు: వైఎస్
వైఎస్ఆర్ సీపీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి