gangula nani
-
అఖిలప్రియకి భారీ షాక్
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి అనూహ్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో మంత్రి అఖిలప్రియకు ఝలక్ ఇచ్చినట్టయ్యింది. గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన విషయం విదితమే. ఆయన అదే పార్టీలో కొనసాగుతుండడంతో గంగుల వర్గం ఓట్లు చీలి తమకు లాభిస్తుందని అఖిలప్రియ భావించారు. కానీ మంగళవారం గంగుల ప్రతాప్‌రెడ్డి ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి (నాని), కుటుంబ సభ్యులు గంగుల మనోహర్‌రెడ్డి, గంగుల సుదర్శన్‌రెడ్డి, గంగుల ఫణిక్రిష్ణారెడ్డి, గంగుల భరత్‌రెడ్డి, కేంద్ర కాటన్ బోర్డు మాజీ డైరెక్టర్ సీపీ శ్రీనివాసరెడ్డి(వాసు)లతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రణాళికపై చర్చించి.. గంగుల బిజేంద్రారెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలంటూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. గంగుల కుటుంబమంతా ఏకం కావడంతో నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. బిజేంద్రను భారీ మెజార్టీతో గెలిపించండి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గంగుల వర్గీయులు, ప్రజలు కలిసి బిజేంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల ప్రతాప్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు తనను సాయం అడిగినందున ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేశానన్నారు. ఆ సమయంలో తనతో మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్‌కు సరైన అభ్యర్థి ఎవరూ లేరని, మీరే సరైన అభ్యర్థి అని తనతో చెప్పారన్నారు. అయితే..ఇప్పుడు కనీసం తనను సంప్రదించకుండానే ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేశారన్నారు. మాట తప్పడం చంద్రబాబు నైజమని అందరూ చెప్పారని, కానీ అప్పట్లో ఆయన మాటలను నమ్మాల్సి వచ్చిందని అన్నారు. ప్రజాబలం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తానన్న చంద్రబాబు..చివరకు ధన బలం చూసే ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేశారన్నది స్పష్టమవుతోందన్నారు. సమావేశంలో సీపీ రామకృష్ణారెడ్డి, గంధం రాఘవరెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆళ్లగడ్డ.. ఎవరికో అడ్డా
సాక్షి, కర్నూలు: జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గంగా ఆళ్లగడ్డకు పేరుంది. 90 శాతం పల్లె ఓటర్లున్న ఈ నియోజకవర్గానికి తూర్పున తెలుగు గంగ, పడమర కేసీ కెనాల్ ప్రవహిస్తున్నాయి. 1953లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి ఆళ్లగడ్డ ప్రాంతం కోవెలకుంట నియోజకవర్గ పరిధిలో ఉండేది. 1955లో శిరివెళ్లగా మారింది. 1962లో ఆళ్లగడ్డ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పట్లో ఆళ్లగడ్డ, శిరివెళ్ల, చాగలమర్రి, రుద్రవరం, గోసుపాడు మండలాలు దీని పరిధిలో ఉండేవి. అప్పట్లో దీనిని ఎస్సీలకు రిజర్వు చేశారు. 1967లో జనరల్ కేటగిరీకి మార్చారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో గోసుపాడు మండలాన్ని నంద్యాల నియోజకవర్గంలో కలపగా అంతవరకు కోవెలకుంట నియోజకవర్గంలో ఉన్న ఉయ్యలవాడ, దొర్నిపాడు మండలాలను ఆళ్లగడ్డలో కలిపారు. 2014లో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమా శోభనాగిరెడ్డి పోలింగ్ ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలింగ్‌ను యధాతథంగా నిర్వహించగా.. టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకరరెడ్డిపై శోభనాగిరెడ్డి గెలుపొందారు. ఆ తరువాత నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆమె కుమార్తె భూమా అఖిలప్రియ ఎన్నికయ్యారు. తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. మూడు కుటుంబాల మధ్యే.. 1967 నుంచి ఇప్పటివరకు గంగుల కుటుంబానికి, వారి ప్రత్యర్థులుగా ఉన్న ఎస్వీ, భూమా కుటుంబాలకు మధ్యే రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ గంగుల తిమ్మారెడ్డి రెండుసార్లు, ఆయన కుమారుడు గంగుల ప్రతాపరెడ్డి మూడుసార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి రెండుసార్లు, ఆయన మేనల్లుడు భూమా శేఖర్‌రెడ్డి ఒకసారి, ఆయన తమ్ముడు భూమా నాగిరెడ్డి రెండుసార్లు, ఆయన భార్య శోభా నాగిరెడ్డి ఐదుసార్లు, వారి కూతురు అఖిలప్రియ ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1967లో గంగుల కుటుంబం నుంచి మొదటిసారి తిమ్మారెడ్డి పోటీ చేయగా.. ఎస్వీ కుటుంబం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి తలపడ్డారు. ఆ తరువాత తిమ్మారెడ్డి కొడుకు గంగుల ప్రతాపరెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి కూతురు శోభానాగిరెడ్డి పోటీ పడ్డారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గంగుల తిమ్మారెడ్డి మనుమడు గంగుల బిజేంద్రారెడ్డి, టీడీపీ తరఫున ఎస్వీ సుబ్బారెడ్డి మనుమరాలు అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. వీరు మూడో తరానికి చెందిన వారు. అఖిలప్రియకు ఎదురీత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ ఎవరితోనూ చర్చించకుండా వెంటనే పార్టీ ఫిరాయించడం, రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్రెడ్డిని విమర్శించడం అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం పెట్టినట్టు ఉందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీడీపీ వేధింపులు తట్టుకోలేక పార్టీ మారిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్న చంద్రబాబు ఆ పదవి ఇవ్వకుండా అవమానాల పాలు చేయడంతో మానసిక వేదనతో నాగిరెడ్డి మృతి చెందారు. ఆ తరువాత అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది. ఆమె ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదు. తనచుట్టూ ఉన్న ముగ్గురు, నలుగుర్ని తప్ప.. ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆస్తి, ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.. ఆర్ అండ్ బీ రోడ్లు, నీరు–చెట్టు పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలు ఆ నలుగురే పంచుకుని రూ.వందల కోట్లు సంపాదించుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టారనే అపప్రద ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అఖిలప్రియ అభ్యర్థిత్వంపై అటు ప్రజల్లోను, ఇటు పార్టీలోను వ్యతిరేకత ఉంది. దీనికి తోడు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాకపోవడం వైఎస్సార్ సీపీకి కలిసొచ్చే అంశం. అమలు కాని హామీలు నియోజకవర్గానికి ఆయువుపట్టు అయిన కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో పంట కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ ఆయకట్టుకు ఏమాత్రం నీరు చేరడంలేదు. ప్రధాన కాలువల మరమ్మతులతోపాటు పంట కాలువల నిర్మాణం చేపడతామన్న హామీ నెరవేర్చలేదు. ఆళ్లగడ్డలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కలగానే ఉంది. అహోబిలంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఫ్యాన్ జోరు నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, ఆమె అనుచరుల అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాటాలు చేస్తూ మూడేళ్లుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డిలకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన మంత్రి అఖిలప్రియ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు కుతాంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో బిజేంద్రారెడ్డికి పట్టం కట్టడానికి నియోజకవర్గ ఓటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగోసారి ఘన విజయం నమోదు చేయటం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. – బీవీ కృష్ణయ్య, సాక్షి, ఆళ్లగడ్డ -
వంచనకు మారుపేరు చంద్రబాబు
ఆళ్లగడ్డ: సీఎం చంద్రబాబునాయుడు వంచనకు మారుపేరని, ఆయన నోటివెంట ఒక్క నిజం కూడా రాదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీని అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గత ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారని విమర్శించారు. నాలుగేళ్లల్లో చేయని అభివృద్ధి పనులు చేస్తున్న నటిస్తూ ప్రజలను మరోసారి మొసం చేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. నియోజవర్గంలో దోపిడీ రాజ్యం సాగుతోందన్నారు. పక్కా ఇల్లు మంజూరు నుంచి మరుగుదొడ్ల వరకు వారు వసూళ్లు, కమీషన్లతో దోచుకుంటున్నారని ఆరోపించారు. వీరికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ప్రజా హృదయనేత వైఎస్సార్ దొర్నిపాడు: తన పరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న నేత వైఎస్సార్ అని గంగుల నాని అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బత్తుల నాగేశ్వరరావు యాదవ్, శ్రీపతిప్రసాద్, ఎస్సీసెల్ మండల కన్వీనర్ లంబు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
హోదా పోరులో టీడీపీకి చిత్తశుద్ధి లేదు
చాగలమర్రి: ప్రత్యేక హాదా సాధనలో భాగంగా చేస్తున్న పోరాటంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి(నాని) విమర్శించారు. ఆదివారం మండలంలోని చిన్నబోధనం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హాదా సాధనకు చేస్తున్న ఉద్యమాలకు ఆదరణ లభిస్తుండటంతో తన మనుగడకు ప్రమాదం వాటిల్లుతందనే ఉద్యమబాట పట్టారన్నారు. రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవంతో రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తుంది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. టీడీపీకి ఇప్పటికీ బీజేపీతో సంబంధాలున్నాయని ఇందుకు ఉదాహరణగా ఇటీవల నియమించిన టీడీడీ పాలక మండలిలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే భార్యను సభ్యురాలుగా నియమించడమేనన్నారు. సాగునీటి సంఘం అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ పత్తి నారాయణ, నాయకులు సింగం భరత్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రమణారెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హోదా భిక్ష కాదు– మన హక్కు ఉయ్యాలవాడ: ప్రత్యేక హోదా అనేది భిక్ష కాదని, మన హక్కని నాని అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. హోదా సాధన పోరును చిత్తశుద్ధితో చేస్తున్నది వైఎస్సార్సీపీ మాత్రమేనన్నారు. టీడీపీ ఉద్యమం పేరుతో నాటకాలాడుతోందని విమర్శించారు. ఒక్కరోజు దీక్షతో చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు. మండల నాయకులు దేశం సోమశేఖర్‌రెడ్డి, కసాని ప్రతాప్‌రెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, గజ్జెల క్రిష్ణారెడ్డి, కాకరవాడ గ్రామ మాజీ సర్పంచ్ చెన్నూరు భాస్కర్‌రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షురాలు పుణ్యలక్ష్మిదేవి, సర్పంచ్ కసాని నారాయణమ్మతో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘వారి సలహా మేరకే పార్టీ మారాం’
-
‘వారి సలహా మేరకే పార్టీ మారాం’
హైదరాబాద్: ప్రజాభీష్టం మేరకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరామని గంగుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన కుమారుడు గంగుల నాని, మద్దతుదారులతో కలిసి ఆయన బుధవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీలో ప్రజా సమస్యలపై చర్చించడం లేదని విమర్శించారు. భూమా నాగిరెడ్డిని టీడీపీలో చేర్చుకోవద్దని చంద్రబాబును కోరినా పట్టించుకోలేదని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందని, పార్టీలో గౌరవం ఉంటుందని తనను బుజ్జగించే ప్రయత్నం చేశారని చెప్పారు. పలుమార్లు మద్దతుదారుల అభిప్రాయంగా కోరగా టీడీపీని వదిలిపెట్టాలని తనకు సలహాయిచ్చారని తెలిపారు. వారి అభీష్టం మేరకు తమ కుటుంబం వైఎస్సార్ సీపీలోకి వచ్చిందని వివరించారు. సంబంధిత కథనాలు: ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదు: వైఎస్ వైఎస్ఆర్ సీపీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి -
‘ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదు’
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని.. ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అధర్మం గెలిచినట్టుగా కనిపించినా చివరకు ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గంగుల ప్రభాకర్ రెడ్డి... వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘గుంగుల ప్రభాకర్ రెడ్డి మా పార్టీలో చేరడం ఆనందాన్ని కలిగిస్తోంది. గంగులన్నను వైఎస్సార్ సీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. అన్నిరకాలుగా ఒకరికొకరు తోడుగా ఉంటాం. రాజకీయాలను ఎంత అన్యాయమైన స్థాయిలోని తీసుకుపోయారన్నది మనం చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మాపై అన్యాయాలు చేస్తున్నారు. మూడేళ్లు గడిచిపోయింది. ఇంకో ఏడాది గడిస్తే ఎన్నికల సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వమే. రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ లలో ఎక్కడైనా సగం వరకు అధర్మం, అన్యాయం గెలిచినట్టు కనిపిస్తుంది కానీ చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుంద’ని అన్నారు. గంగుల నాని, టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, అనుచరులు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. -
‘ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదు’