హోదా పోరులో టీడీపీకి చిత్తశుద్ధి లేదు | YSRCP Leader Gangula Nani Criticized On TDP Party | Sakshi
Sakshi News home page

హోదా పోరులో టీడీపీకి చిత్తశుద్ధి లేదు

Published Mon, Apr 23 2018 7:25 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP Leader Gangula Nani Criticized On TDP Party - Sakshi

మాట్లాడుతున్న గంగుల బిజేంద్రారెడ్డి

చాగలమర్రి: ప్రత్యేక హాదా సాధనలో భాగంగా చేస్తున్న పోరాటంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి(నాని) విమర్శించారు. ఆదివారం మండలంలోని చిన్నబోధనం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాదా సాధనకు చేస్తున్న ఉద్యమాలకు ఆదరణ లభిస్తుండటంతో తన మనుగడకు ప్రమాదం వాటిల్లుతందనే ఉద్యమబాట పట్టారన్నారు. రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవంతో రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తుంది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. టీడీపీకి ఇప్పటికీ బీజేపీతో సంబంధాలున్నాయని ఇందుకు ఉదాహరణగా ఇటీవల నియమించిన టీడీడీ పాలక మండలిలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే భార్యను సభ్యురాలుగా నియమించడమేనన్నారు. సాగునీటి సంఘం అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, మాజీ సర్పంచ్‌ పత్తి నారాయణ,  నాయకులు సింగం భరత్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రమణారెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
హోదా భిక్ష కాదు– మన హక్కు  
ఉయ్యాలవాడ: ప్రత్యేక హోదా అనేది భిక్ష కాదని, మన హక్కని నాని అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. హోదా సాధన పోరును చిత్తశుద్ధితో చేస్తున్నది వైఎస్సార్‌సీపీ మాత్రమేనన్నారు. టీడీపీ ఉద్యమం పేరుతో నాటకాలాడుతోందని విమర్శించారు. ఒక్కరోజు దీక్షతో చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు. మండల నాయకులు దేశం సోమశేఖర్‌రెడ్డి, కసాని ప్రతాప్‌రెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, గజ్జెల క్రిష్ణారెడ్డి, కాకరవాడ గ్రామ మాజీ సర్పంచ్‌ చెన్నూరు భాస్కర్‌రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షురాలు పుణ్యలక్ష్మిదేవి, సర్పంచ్‌ కసాని నారాయణమ్మతో పాటు  వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement