ఏపీ సీఎం చంద్రబాబు ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని.. ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అధర్మం గెలిచినట్టుగా కనిపించినా చివరకు ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గంగుల ప్రభాకర్ రెడ్డి... వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.