
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాని
ఆళ్లగడ్డ: సీఎం చంద్రబాబునాయుడు వంచనకు మారుపేరని, ఆయన నోటివెంట ఒక్క నిజం కూడా రాదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీని అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గత ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారని విమర్శించారు. నాలుగేళ్లల్లో చేయని అభివృద్ధి పనులు చేస్తున్న నటిస్తూ ప్రజలను మరోసారి మొసం చేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. నియోజవర్గంలో దోపిడీ రాజ్యం సాగుతోందన్నారు. పక్కా ఇల్లు మంజూరు నుంచి మరుగుదొడ్ల వరకు వారు వసూళ్లు, కమీషన్లతో దోచుకుంటున్నారని ఆరోపించారు. వీరికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
ప్రజా హృదయనేత వైఎస్సార్
దొర్నిపాడు: తన పరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న నేత వైఎస్సార్ అని గంగుల నాని అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బత్తుల నాగేశ్వరరావు యాదవ్, శ్రీపతిప్రసాద్, ఎస్సీసెల్ మండల కన్వీనర్ లంబు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment