చంద్రబాబు రాజకీయ ఎత్తులు.. జిత్తుల సంగతి పూర్తిగా అవగతం చేసుకున్న భూమా అఖిల ప్రియ.. తనకు తాను అపరచాణక్యుడిలా ఫీలయ్యే చంద్రబాబుకే షాక్ ఇచ్చారట. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత అనూహ్యంగా మంత్రి అయిన అఖిలప్రియ పేరు కన్నా చెడ్డపేరును ఎక్కువ సంపాదించారు.
హత్యలు.. కిడ్నాపులు.. బ్యాంకులను మోసం చేయడం.. రుణాలు ఎగ్గొట్టడం.. బెదిరించడం.. ఇంకా తన తండ్రి అంతరంగికుడు.. ఆప్తమిత్రుడు అయినా ఏవీ సుబ్బారెడ్డి మీద లోకేష్ పాదయాత్రతోనే బహిరంగంగా దాడులు చేయడం వంటి దూకుడు చర్యలతో ఎంత అప్రదిష్టమూటగట్టుకున్నారో ఎవరికీ తెలియదు.. ఆళ్లగడ్డలో మళ్ళీ పోటీ చేసేందుకు ఆమె ఉత్సాహంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవని టీడీపీ అంటోంది.. ఆమెకు టికెట్ ఇస్తే క్యాడర్ సపోర్ట్ చేయదని .. ఆమె దూకుడు పార్టీకి మరింత చేటు చేస్తుందని పార్టీ పెద్దలు భయపడుతున్నారు. అందుకే ఆమెకు టికెట్ లేకుండా పక్కనబెట్టి. ఆమె సపోర్ట్ తీసుకుని వేరేవాళ్లకు టికెట్ ఇచ్చేలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా తెలుగుదేశం సైతం టిక్కెట్లు ఖరారు చేసేందుకు ఓ వైపు సిద్ధం అవుతూనే చంద్రబాబు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు షెడ్యూల్ రెడీ చేసారు. ఈనెల ఐదున తణుకు, ఏడున కృష్ణాజిల్లా తిరువూరు.. తొమ్మిదిన ఆళ్లగడ్డ , పదకొండున నరసరావుపేటలో భారీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ జనసమీకరణతో .. భారీ వేదికలు ఏర్పాటుతో రూపొందే ఈ సభలకు ఆయా స్థానిక నాయకులూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.. బస్సులు.. వేదిక.. సౌండ్ సిస్టం.. రవాణా.. భోజనాలు.. పెద్ద నాయకులకు ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులు లేదా. టికెట్ కోరుకుంటున్నవాళ్ళు చేయాల్సి ఉంది. ఇది అన్ని చోట్లా ఉన్నదే.. అయితే ఆళ్లగడ్డ సభకు మాత్రం భూమా అఖిల ప్రియ మెలికపెట్టినట్లు తెలిసింది.
తనకు టిక్కెట్ ఇస్తామంటేనే ఈ సభ ఖర్చులు తాను పెట్టుకుంటానని. లేకుంటే ఈ సభకు దాదాపు కోటి ఖర్చు చేయలేనని పార్టీ పెద్దలకు చెప్పేసినట్లు తెలిసింది. టిక్కెట్ ఇవ్వనప్పుడు ఈ గడ్డు రోజుల్లో అంత డబ్బును అప్పుతెచ్చి ఎందుకు ఖర్చు చేయాలన్నది ఆమె ఆలోచన అంటున్నారు. ఇప్పటికే కోర్టులు.. కేసులు.. బ్యాంకర్ల నోటీసులతో ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న అఖిల ప్రియా ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇస్తాను అంటేనే సభా ఖర్చుల బాధ్యత తీసుకుంటాను అని .. లేదంటే లేదని ఆమె పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆమెకు టిక్కెట్ ఇస్తారా.. ఆమెను పక్కన పెడతారా అన్నది టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.. ఆమె రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment