సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. రెడ్‌బుక్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రజాపాలన, ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను, అధికారులను టార్గెట్ చేస్తూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా మీడియాలో బహిరంగంగానే భూమా అఖిలప్రియ.. వార్నింగ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు.
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు ఓ రెడ్ బుక్ ఉంది. అందులో వంద మందికిపైగా వైఎస్సార్‌సీపీ నాయకుల పేర్లు ఉన్నాయి. పాపం పోనీలే అని ఇద్దరు, ముగ్గురిని వదిలేస్తున్నాను. కానీ, వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో వంద మంది కచ్చితంగా ఇబ్బంది పడబోతున్నారు. వారి పేర్లు నా రెడ్ బుక్‌లో ఉన్నాయి అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు.
అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను కదా. అదే విధంగా ఎవరినీ వదిలిపెట్టను. అందరి తోలుతీస్తాను. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలను పలువురు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment