సాక్షి, హైదరాబాద్: భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు విఖ్యాత్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు కేసు నమోదైంది. నకిలీ కోవిడ్ సర్టిఫికెట్ సమర్పించి ఈనెల 3న కోర్టులో జరగాల్సిన విచారణకు హాజరుకాలేమని జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవ్ రామ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. భూ వివాదం కిడ్నాప్ కేసులో భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment