
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ మరోసారి ఏపీ పోలీసులపై జులుం ప్రదర్శించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ మరోసారి ఏపీ పోలీసులపై జులుం ప్రదర్శించారు. గణపతి కాంప్లెక్స్ లోని తన నివాసం వద్ద అనుచరులతో పోలీసుల విధులకు ఆటకం కలిగించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను ప్రశ్నించడానికి వచ్చిన పోలీసులపై ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారు. కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. తమ విధులకు ఆటంకం కలిగించిన పవన్, బిన్నయ్య, చిన్నయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండు వారాల క్రితం గచ్చిబౌలిలో ఏపీ పోలీసులపై భార్గవరామ్ దౌర్జన్యం చేశారు. దీంతో ఏపీ పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లోనూ ఏ1 నిందితుడిగా ఉన్న భార్గవ్‌రామ్‌ను ప్రశ్నించేందుకు కొన్నిరోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: అఖిలప్రియ భర్తపై మరో కేసు)