Bhargava
-
నాన్నా.. నేనేం పాపం చేశాను!
అయిజ: భార్యపై అనుమానంతో రెండేళ్ల కుమా రుడిని పొట్టనపెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. వివరా లిలా.. అయిజ పట్టణంలో నివాసముంటున్న భార్గవకు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన శ్రావణితో 2019లో వివాహమైంది. వీరికి కుమార్తె నయనిక, కుమారుడు నందకిశోర్(2) ఉన్నారు. కొంతకాలంగా భార్యను అనుమా నిస్తూ భార్గవ తరుచూ గొడవ పడుతున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పదిరోజుల క్రితం కుమార్తె, కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లేందుకు శ్రావణి ప్రయత్నించగా.. అడ్డు కున్న భార్గవ.. కుమారుడు నందకిషోర్‌ను లాక్కున్నాడు. దీంతో ఆమె కూతురు నయనికను తీసుకొని వెళ్లిపోయింది. నందకిషోర్ ప్రతిరోజూ అమ్మ కావాలని ఏడుస్తుండడంతో.. భరించలేక పసివాడికి నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టాడు. పదిరోజులుగా భార్య లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన భార్గవ వారం క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన అతని తల్లి వడ్లకుమారి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. దీంతో కోలుకున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భార్గవ రెండేళ్ల తన కుమా రుడు నందకిషోర్‌కు ఎలుకల మందు తాగించి, తానూ తాగాడు. గురువారం ఉదయం తల్లి కుమారి నిద్ర లేచేసరికే కొడుకు, మనవడు అపస్మారక స్థితిలో ఉండడం గమనించి.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం భార్గవ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నా.. పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. శాంతినగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
భారీ అవినీతి ఆరోపణలు: పెదవి విప్పిన మారుతీ ఛైర్మన్
సాక్షి,ముంబై: దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీలోని ఎగ్జిక్యూటివ్స్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై తొలిసారి స్పందించారు సంస్థ ఛైర్మన్ ఆర్సీ భార్గవ. ఈ ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు విచారణకు ఆదేశించినట్లు ఛైర్మన్ చెప్పారు. కంపెనీ పాలసీ ప్రకారం తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెండర్స్‌కు కోట్లాది రూపాయల విలువైన ప్రయోజనాలు చేకూర్చడంతో పాటు అధిక ధరకు విడి భాగాలను కొందరు ఎగ్జిక్యూటివ్స్ సరఫరా చేసి వ్యక్తిగత లబ్ది పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తునకు మారుతీ సిద్ధమైంది. అవినీతి ఆరోపణలు రుజువైతే.. చట్టపరమైన చర్యలు తప్పవని సంస్థ ఛైర్మన్ హెచ్చరించారు. పర్చేజ్ డిపార్టమెంట్ లో కొందరు కీలక అధికారులు అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు నేపథ్యంలో కంపెనీ తొలిసారిగా స్పందించింది. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను KPMGకు అప్పగించినట్లు వెల్లడించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ను ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌కు ఇప్పటికే పంపినట్లు చెప్పారు మారుతీ సుజుకీ ఛైర్మన్. కాగా దేశంలోని తయారీ ప్లాంట్లకు అవసరమైన 95 శాతం ముడిసరుకు సప్లయిర్ల నుంచే కొనుగోలు చేస్తుంది మారుతి సుజుకీ. 84 శాతం సప్లయిర్లు.. తయారీ ప్లాంట్లకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. ఈ క్రమంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. -
ఎలక్ట్రిక్‌లోనూ దూసుకెళ్తాం: మారుతీ
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న సెమికండక్టర్ల కొరత సమస్య తాత్కాలికమేనని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ అన్నారు. వచ్చే ఏడాది ఇది సమసిపోతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. కంపెనీపై కొరత ప్రభావం స్వల్పమేనని వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలోకి ప్రవేశిస్తాం. ధర విషయంలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, అలాగే కంపెనీ నష్టపోకుండా ఉన్నప్పుడే ఎంట్రీ ఇస్తాం. సంప్రదాయ కార్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈవీ రంగంలోనూ తొలి స్థానంలో నిలవాలన్నదే మా ధ్యేయం’ అని ఆయన చెప్పారు. -
‘పిల్లలకు కోవిడ్ టీకా’పై మరింత డేటా రావాల్సి ఉంది
న్యూఢిల్లీ: గర్భిణులకు కోవిడ్ టీకా వేయించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. అయితే, చిన్నారులకు కోవిడ్ టీకా ఇవ్వాలా వద్దా అనేది తేల్చేందుకు మరింత డేటా అందాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘గర్భవతులైన మహిళలకు కరోనా టీకాతో ఎంతో ఉపయోగం ఉంది. ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో గర్భవతులకు టీకా ఇవ్వవచ్చని తెలిపింది’అని బలరాం భార్గవ చెప్పారు. ‘చిన్నారులకు కోవిడ్ టీకా వేయడంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. అవసరమైన సమాచారం అందితేనే దీనిపై స్పష్టత వస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ఒక్క అమెరికాలోనే ప్రస్తుతం పిల్లలకు టీకా వేస్తున్నారు. టీకా తీసుకున్న కొందరు చిన్నారుల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి’అని ఆయన అన్నారు. ‘2–18 ఏళ్ల మధ్య వారికి టీకా ఇవ్వడంపై ఒక అధ్యయనం ప్రారంభించాం. దీని ఫలితం సెప్టెంబర్–అక్టోబర్ కల్లా అందుతుంది. దానిని బట్టే ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. చదవండి: మహారాష్ట్ర, కేరళ నుంచి వస్తే కరోనా పరీక్షలు తప్పనిసరి -
పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ విధానంపై బుధవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో హైడ్రామా చోటు చేసుకుంది. వ్యాక్సిన్ విధానంపై చర్చించడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొంటూ పలువురు బీజేపీ ఎంపీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారు విజయ రాఘవన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ వీకే భార్గవ, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయిసంఘం ముందు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అధ్యక్షత వహించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం, జినోమ్ సీక్వెన్సింగ్ (వైరస్ వేరియంట్ల జన్యుక్రమ విశ్లేషణ నమోదు)పై సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై, రెండు టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచాలన్న నిర్ణయంపై పలువురు విపక్ష ఎంపీలు ప్రశ్నించాలనుకోగా, అధికార బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దేశంలో టీకా కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అనవసర అనుమానాలు రేకెత్తించడం సరికాదన్నారు. సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వాయిదా వేయాలన్న డిమాండ్‌పై ఓటింగ్ జరపాలని బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలువురు బీజేపీ ఎంపీలు వాకౌట్ చేశారు. దాదాపు అరగంట పాటు ఈ డ్రామా కొనసాగింది. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో వైద్య, శాస్త్ర, పరిశోధన రంగం చేసిన కృషిని కమిటీ ఈ సందర్భంగా ఘనంగా కొనియాడింది. చదవండి: వైరల్: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం -
అఖిలప్రియ భర్త జులుం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ మరోసారి ఏపీ పోలీసులపై జులుం ప్రదర్శించారు. గణపతి కాంప్లెక్స్ లోని తన నివాసం వద్ద అనుచరులతో పోలీసుల విధులకు ఆటకం కలిగించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను ప్రశ్నించడానికి వచ్చిన పోలీసులపై ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారు. కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. తమ విధులకు ఆటంకం కలిగించిన పవన్, బిన్నయ్య, చిన్నయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల క్రితం గచ్చిబౌలిలో ఏపీ పోలీసులపై భార్గవరామ్ దౌర్జన్యం చేశారు. దీంతో ఏపీ పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లోనూ ఏ1 నిందితుడిగా ఉన్న భార్గవ్‌రామ్‌ను ప్రశ్నించేందుకు కొన్నిరోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: అఖిలప్రియ భర్తపై మరో కేసు) -
మిమ్మల్ని సస్పెండ్ చేయకపోతే.. సీఎండీకి ఉంటది!
‘‘సిమ్‌లు వెనక్కిస్తామని నన్నే బెదిరిస్తారా? అశాంతి నెలకొల్పుతున్నారంటూ మీ మీద సీఎండీకి లెటర్ పెట్టానంటే వెంటనే సస్పెండ్ అవుతారు జాగ్రత్త! ఒకవేళ చేయకపోతే సీఎండీకి మళ్లీ వేరే విధంగా ఉంటుంది. వీరేష్ మీద నేనే ఏసీబీ వారికి చెప్పి నిలబెట్టాను. ఇలాగైతే నేనే మళ్లీ చెప్పాల్సి వస్తుంది.. పోయి పడిపోండని. సిమ్‌కార్డు తిరిగిచ్చి చూడండి!’’అంటూ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కర్నూలు జిల్లా ఎస్ఈ భార్గవరాముడు కిందిస్థాయి ఉద్యోగితో ఫోన్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ భార్గవరాముడు వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. ఏకంగా సీఎండీని ఉద్దేశించి..తాను చెప్పినట్లు చేయకపోతే ‘వేరే విధంగా ఉంటుంద’ని వ్యాఖ్యానించడం ఆయన తీరుకు అద్దం పడుతోంది. కిందిస్థాయి అధికారిపై ఏసీబీ దాడులు చేయకుండా తానే ఆపానని, మళ్లీ తాను చెబితే దాడులు చేస్తారని చెప్పడం కూడా కలకలం రేపుతోంది. ఏసీబీ తన చెప్పుచేతల్లో ఉందనే రీతిలోఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సమయంలో ఆదోని డివిజన్‌కు చెందిన ఒక ఇంజినీరుతో ఎస్ఈ చేసిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు రావడం.. అందులోనూ ఆయన వ్యాఖ్యల తీరుపై ఆ శాఖలో తీవ్ర చర్చ సాగుతోంది. మేం పనిచేయలేం! ఎస్ఈ భార్గవరాముడు తమను సాటి ఇంజినీర్లని కూడా చూడకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ ఆదోని డివిజన్‌కు చెందిన డీఈతో పాటు ఏడీఈ, ఏఈలు సెలవులో వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై నేరుగా సీఎండీతో పాటు వివిధ ఇంజినీర్ల సంఘాలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన చేస్తున్న వ్యక్తిగత విమర్శలను సహించడం తమ వల్ల కాదని, మరీ బూతు పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తాము పనిచేయలేమంటూ సెలవుపై వెళ్లాలని భావిస్తున్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సమయంలో డీఈ, ఏడీఈలు సెలవులో వెళ్లాలని భావిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఈ ఒక ఇంజినీరుకు ఫోన్ చేశారు. మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగారు. అందులో భాగంగా ఏసీబీ పేరు కూడా వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. తన మాట విని ఏసీబీ అధికారులు మీరు అవినీతి చేస్తున్నా చూడకుండా వదిలేశారనే అర్థంలో మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ ఆడియోటేపు ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో సదరు అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. వేధింపుల పర్వం విద్యుత్ శాఖ ఎస్ఈ వ్యవహారశైలి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంటోంది. ఉద్యోగులతో ప్రవర్తించే తీరు సరిగా లేదని, వారితో మాట్లాడే భాష చాలా అసహ్యంగా ఉంటోందనే విమర్శలున్నాయి. ఆయన వాడిన బూతు పదాలను కూడా పేర్కొంటూ ఈ ఎస్ఈ కింద తాను పనిచేయలేనని, బదిలీ చేయాలంటూ ఆదోని డివిజన్ డీఈ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇదే తరహాలో పలువురు ఇంజినీర్లు కూడా ఎస్ఈ వ్యవహారశైలిపై లోలోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది. చెప్పడానికి వీలులేని భాషలో తిడుతూ తమను కించపరుస్తున్నారని వారు వాపోతున్నారు. మొత్తమ్మీద ఎస్ఈ భార్గవరాముడు మాట్లాడిన ఆడియోటేపు ఇప్పుడు ఈ శాఖలో కలకలం రేపుతోంది. -
భార్గవకు యూకే ఫొటోగ్రఫీ అవార్డు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాదీ యువకుడు శ్రీవారి భార్గవ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ అవార్డుకు ఎంపికయ్యారు. రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ లెసైన్సియేట్, అసోసియేట్, ఫెలో అనే 3 విభాగాల్లో ఇచ్చే పురస్కారానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ కుమారుడైన భార్గవ.. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై ఆసక్తి కనపరిచేవారు. నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ చానళ్లలో వచ్చే జంతు సంబంధిత కార్యక్రమాల స్ఫూర్తితో ఫొటోగ్రఫీ చేపట్టానని, దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో జంతువుల ఫొటోలు తీశానని భార్గవ తెలిపారు. -
త్వరలో మారుతీ ఎస్యూవీ..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కొత్త సెగ్మెంట్లలోకి దూసుకువస్తోంది. స్పోర్ట్స్‌యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ), తేలిక రకం వాణిజ్య వాహనాల(ఎల్సీవీ) సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. ఏడాదికి 30 లక్షల వాహనాలు విక్రయించడం లక్ష్యంగా మారుతీ జోరును పెంచుతోంది. దీని కోసం ప్రస్తుతమున్న 12 మోడళ్ల సంఖ్యను 25 వరకూ పెంచుకోనున్నామని మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. కొన్ని నెలల్లోనే ఎస్యూవీ ఏడాదికి 30 లక్షల వాహనాలను విక్రయించాలంటే కనీసం 25 మోడళ్లు అవసరమని భార్గవ చెప్పారు. ప్రయాణికుల వాహనాల మార్కెట్లో అన్ని సెగ్మెంట్లలలో ప్రవేశించాలనే వ్యూహంలో భాగంగా కొన్ని నెలల్లోనే ఒక స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ)ను మార్కెట్లోకి తెస్తామని భార్గవ చెప్పారు. రెనో డస్టర్‌కు పోటీకి దీనిని తేనున్నామని చెప్పారు. అలాగే 2016లో కాంపాక్ట్ ఎస్‌యూవీని తెస్తామని, ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు గట్టిపోటీనిచ్చేలా ఆ కాంపాక్ట్ ఎస్‌యూవీని రూపొందిస్తామని వివరించారు. ఈ రెండు ఎస్‌యూవీలను పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలో అందిస్తామని పేర్కొన్నారు. త్వరలో ఎస్ఎక్స్4 స్థానంలో మిడ్‌సైజ్ సెడాన్, సియాజ్‌ను అందించనున్నామని భార్గవ చెప్పారు. హోండా సిటీ సెగ్మెంట్లో ఈ కారును తెస్తామని పేర్కొన్నారు. ఒక టన్ను మారుతీ ఎల్సీవీ త్వరలో తేలిక రకం వాణిజ్య వాహనం(ఎల్సీవీ) అందిస్తామని భార్గవ చెప్పారు. ఒక టన్ను ఎల్‌సీవీని తెస్తామని, టాటా ఏస్, మహీంద్రా జియో, అశోక్ లేలాండ్ దోస్త్‌లకు పోటీనిచ్చేలా ఈ ఎల్‌సీవీని రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఈ ఎల్సీవీ కోసం ప్రత్యేకంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమకు సొంతంగా కార్లు రూపొందించే శక్తి లేదని, తమ మాతృసంస్థ సుజుకి టెక్నాలజీనే తాము వినియోగిస్తామని వివరించారు. సుజుకి పెద్ద కార్లను తయారు చేయలేదు కనుక తాము ఆ రంగంలోకి ప్రవేశించలేమని వివరించారు. 44 శాతానికి పెరిగిన మార్కెట్ వాటా గత ఏడాది తమ మార్కెట్ వాటా 39 శాతమని భార్గవ చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇది 44 శాతానికి చేరిందని వివరించారు. వాహన మార్కెట్‌కు సంబంధించి తాము కొన్ని సెగ్మెంట్లకే పరిమితమయ్యామని, వంద శాతం ప్రాతినిధ్యం వహించడం లేదని, 79 శాతం ప్రాతినిధ్యమే ఉన్నప్పటికీ, వాహన మార్కెట్లో తమదే అగ్రస్థానమని పేర్కొన్నారు. పండుగ జోష్ కార్లకు సంబంధించి ఎంక్వైరీలు పెరిగాయని, ఈ పండుగల సీజన్లో అమ్మకాలు జోరుగానే ఉంటాయన్న ఆశాభావాన్ని భార్గవ వ్యక్తం చేశారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల డీజిల్ వేరియంట్ల అమ్మకాలు తగ్గాయని చెప్పారు. భారత్‌లో 12 కోట్ల మంది టూవీలర్ల యజమానులున్నారని, వీరందరికీ కార్లు కొనుక్కోవాలనే కోరిక ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాల వృద్ధి జోరుగా ఉంటుందని భార్గవ అంచనా వేస్తున్నారు.