న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న సెమికండక్టర్ల కొరత సమస్య తాత్కాలికమేనని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ అన్నారు. వచ్చే ఏడాది ఇది సమసిపోతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. కంపెనీపై కొరత ప్రభావం స్వల్పమేనని వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలోకి ప్రవేశిస్తాం. ధర విషయంలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, అలాగే కంపెనీ నష్టపోకుండా ఉన్నప్పుడే ఎంట్రీ ఇస్తాం. సంప్రదాయ కార్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈవీ రంగంలోనూ తొలి స్థానంలో నిలవాలన్నదే మా ధ్యేయం’ అని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment