భార్గవకు యూకే ఫొటోగ్రఫీ అవార్డు | UK photography award gains hyderabad youth bhargava | Sakshi
Sakshi News home page

భార్గవకు యూకే ఫొటోగ్రఫీ అవార్డు

Jan 9 2016 4:15 AM | Updated on Sep 4 2018 5:07 PM

భార్గవకు యూకే ఫొటోగ్రఫీ అవార్డు - Sakshi

భార్గవకు యూకే ఫొటోగ్రఫీ అవార్డు

హైదరాబాదీ యువకుడు శ్రీవారి భార్గవ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ అవార్డుకు ఎంపికయ్యారు.

సాక్షి,హైదరాబాద్: హైదరాబాదీ యువకుడు శ్రీవారి భార్గవ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ అవార్డుకు ఎంపికయ్యారు. రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ లెసైన్సియేట్, అసోసియేట్, ఫెలో అనే 3 విభాగాల్లో ఇచ్చే పురస్కారానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.


హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ కుమారుడైన భార్గవ.. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై ఆసక్తి కనపరిచేవారు. నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ చానళ్లలో వచ్చే జంతు సంబంధిత కార్యక్రమాల స్ఫూర్తితో ఫొటోగ్రఫీ చేపట్టానని, దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో జంతువుల ఫొటోలు తీశానని భార్గవ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement