నంద్యాలలో టీడీపీ నేత బూతు పురాణం | Nandyala tdp leader AV subbareddy abuses minority leade | Sakshi
Sakshi News home page

ఎక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతా...

Published Tue, Jul 11 2017 7:43 PM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

నంద్యాలలో టీడీపీ నేత బూతు పురాణం - Sakshi

నంద్యాలలో టీడీపీ నేత బూతు పురాణం

నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ మైనార్టీ నేతపై తాజాగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి నోరు పారేసుకున్నారు. వాట్సప్‌ పోస్టింగ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతు పురాణం విప్పారు. ‘నన్నెవరు ఏమీ చేయలేరు.  ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్యే  ఉండాలి. తమాషా చేస్తున్నావా’  అంటూ ఫోన్‌లో చిందులు వేశారు.

‘నేను అందరిలాంటి వాడ్ని అనుకోకు, నేనెంత మంచివాడ్నో అంత ఇది. నోరు తగ్గించుకుని మాట్లాడు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా. నేనంటే భయం లేదురా నీకు.. నువ్వు హీరో అనుకుంటున్నావురా. చూపిస్తా చూడు’  అంటూ వీరంగం సృష్టించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement