minority leader
-
చిక్కమగళూరులో బీజేపీ మైనారిటీ నేత హత్య
జయనగర: కర్ణాటకలోని చిక్కమగళూరులో బీజేపీ మైనారిటీ నేత మహ్మద్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కేంద్రం బసవనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌరీకాలువ ప్రాంతం లో జరిగింది. బీజేపీ చిక్కమగళూరు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహ్మద్ అన్వర్ (46) శుక్రవారం రాత్రి 9.35 గంటల సమయంలో తన ఇంటి వద్ద కారు దిగుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన్ను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ హత్యతో చిక్కమగళూరులో శనివారం దుకాణాలు మూసి వేయడంతో బంద్ వాతావరణం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. వ్యక్తిగత కక్షలతోనే ప్రత్యర్థులు దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులకు అడ్డుగోడగా నిలిచినందునే అన్వర్‌ను పొట్టనబెట్టుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి మండిపడ్డారు. -
నంద్యాలలో టీడీపీ నేత బూతు పురాణం
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ మైనార్టీ నేతపై తాజాగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి నోరు పారేసుకున్నారు. వాట్సప్ పోస్టింగ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతు పురాణం విప్పారు. ‘నన్నెవరు ఏమీ చేయలేరు. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్యే ఉండాలి. తమాషా చేస్తున్నావా’ అంటూ ఫోన్లో చిందులు వేశారు. ‘నేను అందరిలాంటి వాడ్ని అనుకోకు, నేనెంత మంచివాడ్నో అంత ఇది. నోరు తగ్గించుకుని మాట్లాడు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా. నేనంటే భయం లేదురా నీకు.. నువ్వు హీరో అనుకుంటున్నావురా. చూపిస్తా చూడు’ అంటూ వీరంగం సృష్టించారు. -
బీజేపీ మైనారిటీ నేత, కొడుకు హత్య
రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తండ్రీకొడుకుల హత్య కలకలం రేపింది. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మైనారిటీ నేత ఐయాస్ ఖాన్ పఠాన్ అతని కుమారుడు అసిఫ్ లను కాల్చి చంపారు. తమ నివాసంలో నిద్రిస్తున్న తండ్రీ కొడుకులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం అర్థరాత్రి ఈ హత్యలు జరిగినట్టుతెలుస్తోంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీలో బిగ్ డీల్స్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, ఎన్నికల సందర్భంగా టీడీపీలో పెద్ద డీల్స్ జరుగుతున్నాయి. సీటు ఆశిస్తున్న జూనియర్లను సీనియర్లు బుట్టలో వేసుకుంటున్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, యువనేత నారా లోకేష్‌ల వద్ద తమకు పలుకుబడి ఉందని నమ్మబలుకుతున్నారు. పార్టీకి రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, వచ్చేది మన ప్రభుత్వమేనంటూ వారిని ఊహాలోకాల్లో తేలుస్తున్నారు. రాజధానిలో ముఖ్యనేతలతో భేటీకి అపాయింట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు. ఒకరిద్దరు ముఖ్యనేతలైతే నా ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తే సీటు గ్యారంటీగా ఇప్పిస్తానంటున్నారు. ముఖ్యనేతల భేటీకి, రాజధాని చుట్టూ ప్రదక్షణలు చేయడానికి ఇప్పటికే లక్షలు ఖర్చయ్యాయని కొందరు జూనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా డబ్బు ఉండి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు వీరి మాటల గారడీలో సులభంగా పడిపోతున్నారు. గుంటూరు తూర్పులో రెండు సామాజిక వర్గాల నేతలు సీటు మోజులో రాజధాని చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. సౌదీలో ఇంజినీరుగా పనిచేసిన ఒక మైనార్టీ నేత, మరో సామాజికవర్గానికి చెందిన వ్యాపారి సీటు కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేస్తున్నారు. సీటు ఇస్తే పార్టీకి ఫండ్ ఇస్తామని, ఎన్నికలకు ఎంతైనా ఖర్చు చేస్తామంటున్నారు. రాజకీయాలతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా నేతల మాయలో పడి ఎన్టీఆర్ భవన్, ఇతర ముఖ్యనేతల నివాసాల వద్ద పడిగాపులు పడుతున్నారు. మైనార్టీనేతకు తెరవెనుక ఒక మాజీ మంత్రి ఉన్నారని, మరో సామాజికవర్గం నేతకు జిల్లా పార్టీలో ముఖ్య భూమిక వహిస్తున్న నేత ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసిన ఒక నేతకు సత్తెనపల్లి సీటు ఇప్పిస్తానని జిల్లా పార్టీలో ముఖ్య భూమిక వహిస్తున్న నేత హామీ ఇచ్చారు. ఆ మేరకు అతని నుంచి సేవలు పొందారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సీటును మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా నేత మౌనందాల్చారు. మరో సీనియర్ నేత నిన్న మొన్నటివరకు తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఇక్కడ నీకు టిక్కెట్ ఇప్పిస్తానంటూ ఓ బీసీ నాయకునికి చెబుతూ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు అతనితో ఖర్చు పెట్టించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రముఖ పారిశ్రామిక వేత్తలను పట్టుకుని వారికి టిక్కెట్ ఇప్పించేందుకు అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. టిక్కెట్ ఇప్పిస్తే తనకు అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చును ఆయన భరించేలా మాట్లాడుకుని ఒక పారిశ్రామిక వేత్తను తెరపైకి తెచ్చారు. మరోవైపు పల్నాడు ప్రాంతంలోని ఒక నియోజకవర్గం టిక్కెట్ ఇప్పిస్తానంటూ బీసీ వర్గానికి చెందిన ఓ ఉన్నతాధికారి వద్ద భారీ మొత్తంలో డబ్బు మాట్లాడుకుని అధినేత వద్ద పావులు కదుపుతున్నట్టు పార్టీలో వినపడుతోంది. ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆసక్తితో జిల్లాకు వచ్చిన ఓ ఎన్ఆర్ఐ వైద్యుని వద్ద సీనియర్లు డబ్బు గుంజినట్టు అధినేతకు ఫిర్యాదులు అందాయి. ఆ వైద్యునికి న్యాయం జరగకపోగా సీనియర్ నేతకు డబ్బు ఇచ్చిన పాపానికి టీడీపీ హైకమాండ్ ఆయనకు టిక్కెట్‌ను నిరాకరించింది. సీట్ల కేటాయింపు త్వరగా తేల్చాలని, లేకపోతే నేతల మాయలో పడి మరికొంత నష్టపోతామని కొత్తతరం నేతలంటున్నారు. -
ఉన్ కో ఓట్ నై దాల్తే
బీజేపీతో పొత్తుపై టీడీపీ ముస్లిం నేతల సమావేశం అపవిత్ర పొత్తంటూ మండిపాటు బీజేపీకి ఓటు వేయరాదని తీర్మానం హిందూపురం బాలకృష్ణకు ఇస్తే.. ఘనీకి ‘అనంత’ ఎంపీ సీటివ్వాలి అనంతపురం ఎమ్మెల్యే సీటు నదీంకు ఇవ్వాలి అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : మతతత్వ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెలుగుదేశం పార్టీ ముస్లిం, మైనార్టీ నేతలు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం అర్బన్ స్థానం బీజేపీకి కేటాయిస్తే ఆ స్థానంతో పాటు అనంతపురం ఎంపీ స్థానంలో కూడా ఘోరంగా ఓడిపోవాల్సి ఉంటుందని నాయకులు హెచ్చరించారు. బీజేపీకి సహకరించేది లేదంటూ అన్ని నియోజకవర్గాల నేతలు తీర్మానించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు.. ి2009 ఎన్నికల్లో అనంతపురం స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి కేవలం 800 ఓట్లు, ఉప ఎన్నికల్లో 666 ఓట్లు వచ్చాయని, అలాంటి పార్టీకి ఈ సీటును ఎలా కేటాయిస్తారని హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, టీడీపీ నేత నదీమ్ అహ్మద్ ప్రశ్నించారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ముస్లింలు ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని తాడిపత్రి, పామిడి, గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లో దాదాపు 2.70 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని, జిల్లా కేంద్రంలో టీడీపీకి సీటు కేటాయించకపోతే ఆ ప్రభావం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలపై పడుతుందన్నారు. జిల్లాలో ఒక ఎంపీ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు మైనార్టీ నేతలు మాట్లాడుతూ.. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ పోటీ చేయాల్సి వస్తే అబ్దుల్ ఘనికి అనంతపురం ఎంపీ స్థానాన్ని, అనంతపురం ఎమ్మెల్యే స్థానాన్ని నదీం అహ్మద్‌కు కేటాయించాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులుకు అందజేశారు. సమావేశంలో మైనార్టీ నేతలు ఉమర్‌బాషా, ఫిరోజాబేగం, మైనుద్దీన్, రవూఫ్, అల్లాబకష్, ఖాజా పాల్గొన్నారు.