
హనీ ఈస్ ద బెస్ట్.. అని చదవగానే మీ మనసులో మెహరీన్ కౌర్ మెరుస్తారని తెలుసు. ఆ బెస్ట్ హీరోయిన్ గురించి కొత్త వివరాలను తెలుసుకోవాలనే ఆత్రం మొదలవుతుందనీ తెలుసు. అందుకే ప్రస్తుతానికి ఆమె ఇష్టపడే వెరీ బెస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్‌ను పరిచయం చేస్తున్నాం ఇక్కడ..
అంజలి భాస్కర్
ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ఒకరు అంజలి భాస్కర్. 2010లో ’సమత్వం’ పేరుతో సంస్థ స్థాపించి, 12 ఏళ్ల పాటు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలతో రూపొందించిన @ఫైబర్ టు ఫ్యాషన్ డిజైనర్ డ్రెస్‌లు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే వేల రూపాయల నుంచి లక్షల్లో ఉంటుంది. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ అంజలి భాస్కర్ డిజైన్స్ లభిస్తాయి.
బ్రాండ్ వాల్యూ
నీరహ్ బై నిధి జ్యూయెల్స్.. ఆన్‌లైన్ జ్యూయెలరీ షాపింగ్‌లో అన్ని వర్గాలను అలరిస్తున్న బ్రాండే ‘నీరహ్ బై నిధి జ్యూయెల్స్’. అతి తక్కువ ధరల్లో లభించే వీటికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ మెయిన్ ఫ్లాట్‌ఫామ్‌గా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇతర ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి ఈ ఆభరణాలు.
ఇయర్‌రింగ్స్
బ్రాండ్: నీరహ్ బై నిధి
ధర: రూ. 199
చీర డిజైనర్:
సమత్వం బై అంజలి భాస్కర్
ధర: రూ. 26,000
గంటలు గంటలు షాపింగ్ చేయటం నాకు ఇష్టం ఉండదు.. షాప్‌లోకి వెళ్లిన వెంటనే నచ్చింది కొనేస్తాను. ట్రయల్ కూడా చేయను. అందుకే స్క్రీన్ షాపింగ్ ఎక్కువగా చేస్తాను. – మెహరీన్ కౌర్
Comments
Please login to add a commentAdd a comment