
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ కౌర్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తన్న ఈ సినిమా షూటింగ్ హైదరబాద్‌లో జరుపుకుంటోంది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మెహరీన్‌కు సంబంధించిన ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇకపై మెహరీన్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని దీని సారాంశం. ఎఫ్ 3 తరువాత మరే ఏ సినిమాలోనూ నటించదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తను వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే కారణం అని తెలుస్తోంది.
కాగా త్వరలోనే ఈ భామ పెళ్లి పీటలు ఎక్కనుందన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని, మెహరీన్ పెళ్లాడబోతున్నట్లు ఇటీవల ఆవిడే స్వయంగా వెల్లడించారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనువడే భవ్య బిష్ణోయ్. రాజస్థాన్‌లోని జైపుర్ అలీలా కోటలో మార్చి 12న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. అయితే గొప్పింటికి కోడలుగా వెళ్తుంది కాబట్టి మెహరీన్ ఇకపై నటించకపోవచ్చని అంటున్నారు. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకున్న ఆమె సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అదే విధంగా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని వివరించారు.
చదవండి: మాజీ సీఎం మనువడితో హీరోయిన్ పెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment