
Mehreen Pirzada Calls Off Engagement: ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, కవచం, చాణక్య, ఎఫ్2 వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకుంది. వరుస ఆఫర్స్‌తో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అనంతరం ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే పెళ్లి అనంతరం తను నటించనని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది.
పెద్దింటికి కోడలు అవుతుంది కదా అందుకే నటించకూడదని నిర్ణయించుకుందేమోనని అనుకుని అభిమానులంతా ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక గత నెలలలోనే భవ్యతో తన పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి పనులతో బిజీగా ఉన్నట్లు చెప్పిన మెహ్రీన్ సడెన్‌గా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడినట్లు చెప్పింది. అంతేగాక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఈ గ్యాప్‌లో తను సంతకం చేసిన ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో మెహ్రీన్‌కు ఓ పెద్ద హీరోతో నటించే ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం.
అయితే త్వరలోనే పెళ్లి పెట్టుకుని మెహ్రీన్ కొత్త ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పడం అందరిని కాస్త ఆశ్యర్యపరిచినా.. పెళ్లికి ఇంకా చాలా గ్యాప్ ఉందేమోనని అభిప్రాయపడ్డారు. ఏమైందో ఏమో తెలియదు శనివారం ఉదయం లేచేసిరికి తన సోషల్ మీడియా ఖాతాల్లో భవ్య బిష్ణోయ్‌తో తను వివాహం రద్దు చేసుకున్నట్లు పోస్టులు దర్శనం ఇచ్చాయి. ‘ఇక నుంచి భవ్యతో కానీ, తన కుటుంబ సభ్యులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా ఇష్టంగా తీసుకున్న నిర్ణయం. నా వ్యక్తిగతం. ప్రతిఒక్కరు నా నిర్ణయాన్ని, ప్రైవసీని గౌరవిస్తారని అనుకుంటున్న’ అని ఆమె పోస్టులు చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఓ సీనియర్ స్టార్ హీరో అని, ఆయన సినిమాలో అవకాశం రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందంటూ నెటిజన్లు తమదైన శైలిలో చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment