సాక్షి,హైదరాబాద్: మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరో తెరకెక్కిన ‘మహానుభావుడు’ టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. శర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానుభావుడు. మహానుభావుడు టైటిల్ సింగిల్ ను నేడు( సెప్టెబర్ 7న ఉదయం) విడుదల చేశారు. దీంతో తమన్ సంగీతంపై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.
ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ధియెట్రికల్ ట్రైలర్ ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున‍్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందించిన ఈ మూవీని దసరా కు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మ్యూజికల్ లవ్ స్టోరి గా రూపొందిన ఈ చిత్రం ద్వారా మరోసారి హిట్ కొట్టాలని హీరో శర్వానంద్ ఆశిస్తున్నారు. శర్వానంద్‌కు జంటగా మెహరీన్ నటిస్తుండగా వెన్నెల కిషోర్, నాజర్, భద్రం, కళ్యాణి నటరాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు.
‘మహానుభావుడు’ టైటిల్ సాంగ్..
Published Thu, Sep 7 2017 9:34 AM | Last Updated on Tue, Sep 12 2017 2:10 AM
Advertisement
Advertisement