దసరా బరిలో విజేత ఎవరు..? | Who will win Dussehra Race | Sakshi
Sakshi News home page

దసరా బరిలో విజేత ఎవరు..?

Published Sat, Sep 30 2017 3:06 PM | Last Updated on Sun, Oct 1 2017 1:22 PM

Dusshera Films

ఈ దసరా సీజన్ లో తెలుగు తెరపై భారీ పోటి నెలకొంది. ఇద్దరు టాప్ హీరోలు వారం రోజుల గ్యాప్ లో తలపడటంతో థియేటర్లు కలకలలాడాయి. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలు కావటంతో ప్రమోషన్, రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతటి భారీ పోటీలో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో బరిలో దిగాడు శర్వానంద్. మరి ఈ ముగ్గురిలో దసరా విజేత ఎవరు..?

దసరా బరిలో ముందుగా థియేటర్లలోకి వచ్చిన హీరో ఎన్టీఆర్. జై లవ కుశ సినిమాతో సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కథలో కొత్తదనం లేకపోవటం లాంటి చిన్న చిన్న మైనస్ లు కనిపించినా.. లాంగ్ వీకెండ్ కలిసి రావటం వారం పాటు పోటి లేకపోవటంతో భారీ వసూళ్లనే సాధించి సత్తా చాటాడు. ఇప్పటికీ జై లవ కుశ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.

పర్ఫెక్ట్ దసరా సీజన్ లో సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. 120 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన స్పైడర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ రావటం అభిమానులను నిరాశపరిచింది. కానీ టాక్ ప్రభావం కలెక్షన్ల మీద మాత్రం కనిపించటం లేదు. రెండు భాషల్లో కలిపి ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కు చేరువైన స్పైడర్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.

దసరా సీజన్ లో చివరగా బరిలో దిగిన హీరో శర్వానంద్. పండుగ సీజన్ లో టాప్ స్టార్లతో పోటి పడి మంచి విజయాలు సాధించిన శర్వానంద్ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేలాగే ఉన్నాడు. పండుగకు ఒక్క రోజు ముందు థియేటర్లలోకి వచ్చిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రొటీన్ టేకింగ్ తో తెరకెక్కిన సినిమానే అయినా.. కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు మహానుభావుడు. మరి ఈ ముగ్గురిలో ప్రేక్షకులు ఎవరికి విజయాన్ని అందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement