
మహేష్ మూవీ టీం షాకింగ్ డెసిషన్..!
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ కొత్త సినిమా స్పైడర్ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ ఆలస్య కావటంతో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.
అయితే ఈ సినిమా రిలీజ్కు వారం ముందు సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ రిలీజ్ అవుతోంది. దీంతో రెండు సినిమాల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవ కుశపై కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో పోటి రసవత్తరంగా మారుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. వంద కోట్లకు పైగా బడ్జెట్తో ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు.