ఆర్మీ ఆఫీసర్‌గా యంగ్ హీరో | Sharwanand As Army Officer in Hanu Raghavapudi movie | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 31 2017 12:53 PM | Last Updated on Sun, Dec 31 2017 12:53 PM

Sharwanand As Army Officer in Hanu Raghavapudi movie - Sakshi

విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్. 2017లో రెండు ఘనవిజయాలు అందుకున్న ఈ యంగ్ హీరో కొత్త కొత్త ఏడాదిలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మహానుభావుడు సినిమాతో సత్తా చాటిన శర్వ, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. లై సినిమాతో నిరాశపరిచిన హను, శర్వానంద్ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. అంతేకాదు సెకండ్ హాఫ్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement