పవన్, నితిన్, త్రివిక్రమ్ల 'లై' | Pawan Kalyan, Nithin Movie Title LIE | Sakshi
Sakshi News home page

పవన్, నితిన్, త్రివిక్రమ్ల 'లై'

Published Wed, Dec 7 2016 2:31 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్, నితిన్, త్రివిక్రమ్ల 'లై' - Sakshi

పవన్, నితిన్, త్రివిక్రమ్ల 'లై'

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం ఈ లవర్ బాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథా కథనాలు అందిస్తున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపించేలా 'లై' అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. ఇంగ్లీష్లో LIE అనే రాసే ఈ టైటిల్కు 'లవ్ ఈజ్ ఎండ్ లెస్' అనే ట్యాగ్ లైన్ను జోడిస్తున్నారు. నితిన్ ఇమేజ్కు తగ్గట్టుగా ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నితిన్ మరోసారి తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement