
ఉప్పు నీటిని చల్లి వాము(ఓమ)ను కొద్దిగా వేయించితే తినేటప్పుడు ఘాటుగా అనిపించదు. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని ఆ డబ్బాలో కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.కరివేపాకును గాజు సీసాలో వేసి మూతపెట్టి, ఫ్రిజ్‌లో ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి. పల్లీలను తరచూ వంటలలో ఉపయోగిస్తుంటారు. వంటకు వాడినప్పుడల్లా వాటిని, వేయించి పొడి చేసుకుంటుంటారు. అలా కాకుండా ఒకేసారి వేయించి, చల్లారాక సగం గాజు బాటిల్‌లో పోసి భధ్రపరుచుకోవాలి. మిగతా సగం పొడి చేసుకుని బాటిల్‌లో పోసి ఉంచుకుంటే టైమ్, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి. లెదర్ బ్యాగ్ మురికి పోవాలంటే హ్యాండ్‌వాష్ (చేతులు శుభ్రపరుచుకునే లిక్విడ్)లో ముంచిన దూది ఉండతో తుడవాలి.
టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ మంచి నూనె కలిపి ఎండుమిరపకాయలున్న జార్‌లో అడుగున వేసి ఉంచితే మిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.తెలుపురంగు మురికి బట్టలను ఉతికాక బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో కొద్ది సేపు నానబెట్టి, నీళ్లలో జాడించి ఆరవేయాలి. మురికి పూర్తిగా వదిలి, తెల్లగా అవుతాయి.బంగారు, వెండి నగలను విరిగిన పాలతో కడితే త్వరగా శుభ్రపడతాయి. బంగాళ దుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిలో కొన్ని కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.
Comments
Please login to add a commentAdd a comment