పురాతన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు, ఆయుధాలు, విలువైన వస్తువుల గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే వేటితో వంటలు చేసుకునేవారు, వారు ఉపయోగించిన వంట సామాగ్రి గురించి విన్నాం. కానీ పురాతన కాలంలో ఎలాంటి కూరలు వండుకునేవారు, ఏం తినేవారు తెలియదు. వాటి గురించి చరిత్రకారులు రాసిన దాఖాలాలు కూడా లేవు. అయితే తాజాగా ఫర్మానాలో జరిపిన తవ్వకాల్లో నాలుగువేల ఏళ్ల నాటి పురాతన వంటకం వెలుగులోకి వచ్చింది. మన పూర్వీకులు అప్పట్లోనే అలా వండుకుని తినేవారా అని కంగుతిన్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ అదేం కర్రీ?.. ఏ దేశపు వంటకం అంటే..
మన పూర్వీకుల తరుచుగా ఏం వంటకాలు వండుకుని తినేవారు అనే దిశగా సాగిన తవ్వకాల్లో కొంత వరకు పురొగతి సాధించారు శాస్త్రవేత్తలు. ప్రతి వంటకం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి వచ్చిన వంటకాలే. అయితే ఆ కాలంలో కుండలు, దంతాల అవశేషాల సామాగ్రితో చేసుకునేవారు. ఇక్కడ శాస్త్రవేతలు హరప్పా నగరమైన రాఖీగర్హికి ఆగ్నేయంగా ఉన్న ఫర్మానాలో పూర్వీకుల వంటకాలు గురించి చేసిన అన్వేషణలో నాలుగు వేల ఏళ్ల నాటి పురాతన వంటకాన్ని గుర్తించారు
వారు తవ్వకాల్లో ఒక కుండలో పసుపు, అల్లం, వెల్లుల్లి, వంకాయలతో చేసి అవశేషాలను గుర్తించారు. ఈ మిశ్రమం ఆధునికులకు బాగా తెలిసిన రెసిపీనే. ముఖ్యంగా ఇది భారతదేశ వంటకం. దీంతో ఈ కూర ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదయ్యిన పురాతన కూరల్లో ఒకటిగా నిలిచింది. మన పూర్వీకులు, అరటి పండ్లు, మామిడి వంటివి తినేవారని, పొట్లకాయ, ఖర్జురాలు ఎక్కువగా ఉపయోగించినట్లు తవ్వకాల్లో గుర్తించారు గానీ కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే తాజాగా గుర్తించిన పురాతన కూరలో వాడిన అల్లం పసుపు హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లోనే గుర్తించడం జరిగింది.
అంతేగాదు ఈ సుగంధ ద్రవ్యాలే 2023లో వియత్నాంలో 2 వేల ఏళ్ల నాటి ఇసుకరాయి స్లాబ్‌పై కనిపించి కూర అవశేషాల్లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడ పరిశోధకులు మైక్రోస్కోపిక్ ద్వారా స్టార్చ్ ధాన్యాలను పరిశీలించారు. విశ్లేషణలో పసుపు, అల్లం, వంటి విభిన్న సుగంధద్రవ్యాల మూలాలను గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే ఆసియా వంటకాల మూలాలు చరిత్రలో స్థిరంగా ఉన్నాయని తెలుస్తోందన్నారు శాస్తవేత్తలు. ఇక పురాతన వంటకాన్ని ఎలా చేస్తారో చూద్దామా..!
మన భారతీయలు ఈజీగా చేసుకునే వంకాయ వేపుడే!.. నాటి పుర్వీకులు చేసుకునేవారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే.. వంకాయ వేపుడు పురాతన వంటకంగా తెలుస్తోంది. ఈ రెసిపీని నాటి పూర్వీకులు ఎలా చేసుకున్నారనే దాని గురించి ప్రముఖ చెఫ్ కునాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు.
కావాల్సిన పదార్థాలు. .
రెండు పెద్ద సైజు వంకాయలు
నాలుగు టేబుల్ స్పూన్ల నూనె
అల్లం వెల్లుల్లి పేస్ట్
కరివేపాకు
పసుపు
ఉప్పు తగినంత
తయారీ విధానం: ఓ కడాయిలో నూనె వేసుకుని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేయించి ఆ తర్వాత తరిగి పెట్టుకున్నవంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఓ ఐదు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి తర్వాత దించేయాలి. అంతే వంకాయ వేపుడు రెడీ..!
(చదవండి: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment