
కూరల్లో తిరుగుతుంది
స్టౌపై వండే ఏ వంటలకైనా గరిటతో అవసరం తప్పదు. అది కూరైనా, పులుసైనా గరిటతో కలపకుంటే కుదరదు. చాలామందికి అదొక పెద్ద పని అనే చెప్పొచ్చు. అందుకే వచ్చేసింది ‘ఆటోమేటిక్ పాట్ స్టిరర్’. ఇకపై వంట చేసేంత సేపు గరిటకు పని చెప్పాల్సిన పని లేదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ స్టిరర్‌ను... కూర లేదా పులుసులో పెట్టి, దానికున్న బటన్ నొక్కితే చాలు. దానంతట అదే తిరుగుతుంది. ఇవి బ్యాటరీ సాయంతో పని చేస్తాయి. అలాగే ఈ స్టిరర్‌కు మూడు స్పీడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎంత స్పీడు కావాలంటే, అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు.
వీటికున్న లెగ్స్ (గిన్నెలో పడిపోకుండా నిల్చునే కాళ్లు)ను స్టిరర్ పైభాగం నుంచి విడదీసి, మామూలు డిష్‌వాషర్‌తోనే శుభ్రం చేసుకోవచ్చు. ఇవి 150 డిగ్రీల వేడిని తట్టుకుంటూ... అదేపనిగా నాలుగు గంటల పాటు తిరగ్గలవు. ఇవి కూర, రసం, గ్రేవీ మొదలైన అన్ని వంటకాల్లోనూ తిరుగుతాయి.