
తలసేమియా బాధిత బాలుడి నుంచి వేలి ముద్ర తీసుకుంటున్న వలంటీర్
తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి వలంటీర్ చెన్నై వెళ్లి మరీ పింఛన్ అందజేశాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భూక్యా వెంకటేశ్వరరావు, అమల దంపతుల కుమారుడు భూక్యా జ్యోతీశ్వర్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు
నందిగామ: తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి వలంటీర్ చెన్నై వెళ్లి మరీ పింఛన్ అందజేశాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భూక్యా వెంకటేశ్వరరావు, అమల దంపతుల కుమారుడు భూక్యా జ్యోతీశ్వర్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి ప్రభుత్వం నెలవారీ పింఛన్ అందిస్తోంది. ప్రస్తుతం ఆ బాలుడిని శస్త్ర చికిత్స నిమిత్తం చెన్నైలోని రేలా ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో గ్రామానికి చెందిన వలంటీర్ బాణావత్ రాముడునాయక్ శుక్రవారం చెన్నై వెళ్లి జ్యోతీశ్వర్‌కు పింఛను నగదు అందజేసి పని పట్ల నిబద్ధతను చాటుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు వలంటీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: సీఎం జగన్ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు..