మా ఉసురు తగులుద్ది.. | Pensioners Serious Comments on Chandrababu about Volunteer Pension Distribution | Sakshi
Sakshi News home page

మా ఉసురు తగులుద్ది..

Published Tue, Apr 2 2024 8:34 AM | Last Updated on Tue, Apr 2 2024 8:34 AM

Pensioners Serious Comments on Chandrababu about Volunteer Pension Distribution - Sakshi

ఒంగోలులో మంచంలో ఉన్న వృద్ధురాలికి పింఛన్‌ ఇస్తున్న వలంటీర్‌ (ఫైల్‌)

మూడుచక్రాల సైకిల్‌పై ఉన్న ఈ దివ్యాంగుడి పేరు షేక్‌ పాచ్ఛా. పొదిలికి చెందిన ఇతను టీడీపీ ప్రభుత్వంలో పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక వికలాంగ పింఛన్‌ మంజూరైంది. ఠంఛనుగా ప్రతినెలా వలంటీర్‌ ఇంటికి వచ్చి పింఛన్‌ ఇచ్చేవాడు. ఇప్పుడు టీడీపీ నాయకుల కుట్రలతో వలంటీర్లు పింఛన్‌ పంపిణీ చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘ఎండలో సచివాలయాలకు వెళ్లి క్యూలో ఉండి అధికారుల కోసం పడిగాపులు కాసి పింఛను తీసుకోవాల్సిన దుస్థితి కలి్పంచారు.. మా పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వకుండా అడ్డుకున్న వారు బాగుపడరు. మాలాంటి వృద్ధులు, వికలాంగుల ఉసురు తప్పక తగులుతుంది’’ అంటూ మండిపడ్డాడు.  

ఈ వృద్ధురాలి పేరు అల్లు తిరుపతమ్మ. వయస్సు 80 సంవత్సరాలు. తర్లుపాడు మండలం జగన్నాథపురానికి చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. కాస్త దూరం కూడా నడవలేని స్థితిలో ఉన్న ఈమెకు వలంటీరే ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్‌ అందించేవారు. చంద్రబాబు కుతంత్రంతో ఇప్పుడు వలంటీర్లు పింఛను ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సుమారు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి సచివాలయం దగ్గర పింఛన్‌ తీసుకోవాల్సి వస్తోంది. ‘‘1వ తేదీ అయినా వలంటీరు రాకపోవడంతో వాకబుచేస్తే వలంటీర్లు పింఛన్‌ ఇవ్వకూడదంటూ టీడీపీ నేతలు కేసులు వేశారని.. అందుకే వారు రాలేదని తెలిసింది. ఎండలు మండిపోతున్నాయి. సచివాలయం దాకా నడిచి వెళ్లి పింఛను తీసుకోలేను. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. మంచి చేసే వాళ్ల మీద కేసులు పెట్టడం ఏందయ్యా..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒకటో తేదీ వచ్చిందంటే అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు చిందేవి. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా అందరి ఇళ్ల ముందు సూర్యోదయానికి ముందే వలంటీర్లు ఇళ్ల ముందుకు వచ్చేవాళ్లు. ఏమవ్వా బాగున్నావా... ఏం తాతా ఎలా ఉన్నావంటూ కుశల సమాచారాలు అడిగి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ డబ్బులు వారి చేతుల్లో పెట్టేవారు. అవి అందుకున్న వాళ్ల కళ్లల్లో మెరుపులు చూసి వలంటీరు సంతృప్తి పడేవారు. ఎండైనా, వానైనా లెక్కచేయకుండా అవ్వా తాతలకు పింఛన్లు అందజేసేవారు. ఒకవేళ ఏదైనా పనిమీద వేరే ఊర్లకు వెళ్లి ఉన్నా, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా అక్కడికి వెళ్లి అందజేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. 

ఇలా అభాగ్యులకు అండగా ఉండే వలంటీరుపై పచ్చదండు కక్ష గట్టింది. రోజుకో రకమైన కథనాలు పచ్చమీడియా వండివార్చేది. అయినా రెట్టించిన ఉత్సాహంతో వలంటీర్లు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా శ్రమిస్తూ వస్తున్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి నాయకులు ఇళ్లకు పరిమితమైతే తన ప్రాణాలకు లెక్కచేయకుండా వలంటీరు సాయం అందించాడు. ఎన్నో మంచి పనులు చేసిన వారి సేవలు ఎల్లో మీడియాకు పట్టలేదు. ఎన్నికల పేరు చెప్పి వారిని అభాసుపాలు చేసేలా రోజుకో రకంగా అసత్య కథనాలు వండివార్చింది. కోర్టులకు ఎక్కింది. తాజాగా ఎన్నికల పేరు చెప్పి కొత్త కుట్రలకు తెరతీసింది. తన అనుకూలుర ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు మీద ఫిర్యాదులు చేయించింది. ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుదోవ పట్టించింది.

ఫలితంగా వలంటీరు ఇంటికి వెళ్లి పింఛన్‌ ఇవ్వరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. దీనికి కారణమైన పచ్చదండుపై అవ్వాతాతలు, అభాగ్యులు మండిపడుతున్నారు. ప్రజల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేము ఏమన్యాయం చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం, అధికార పారీ్టపై ఆ అపవాదు తోసే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పత్రికా ప్రకటన. చేసిన తప్పును ఇలా కప్పిపుచ్చుకునేలా ప్రకటనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

జిల్లాలో 2 లక్షల 95 వేల మందిపై ప్రభావం 
తెలుగుదేశం పార్టీ దుష్ట కూటమి కుట్రలతో జిల్లాలో 2 లక్షల 95 వేల మంది పింఛన్‌దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వీరందరికీ ప్రతి నెలా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి మరీ పెన్షన్లు ఇచ్చేవారు వలంటీర్లు.  ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్లు క్రమం తప్పకుండా పెన్షన్‌ వచ్చేది. ఇందుకోసం నెలకు రూ.88.21 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తెలుగుదేశం చేసిన కుట్రల వలన ఈ నెల చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చింది. సహజంగానే వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటు¯ంటారు. ఇందులో ఎంతో మంది ప్రతినెలా వచ్చే పెన్షన్‌ డబ్బులు చేతికి అందగానే వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతుంటారు. అవసరమైన ఔషధాలను కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతినెలా వచ్చే పెన్షన్‌ ఎప్పుడు వస్తుందో తెలియక కొందరు వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్లు రాకుండా అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు పోయేకాలం దాపురించిందని విమర్శిస్తున్నారు. 

చంద్రబాబు పాలనలో నరకయాతన  
చంద్రబాబు పాలనలో పెన్షన్లు తీసుకోవాలంటే నరకయాతన లాగా ఉండేది. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్‌ కోసం పెన్షన్‌ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఏ రోజు పెన్షన్‌ ఇస్తారో తెలియక రోజుల తరబడి ఎంపీడీఓ కార్యాలయం, పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఉండేది. పైగా జన్మభూమి కమిటీలకు లంచాలు ముట్టచెప్పిన వాళ్లకు త్వరగా పెన్షన్లు అందేవి. ఒకరు చనిపోతే గానీ కొత్తవి వచ్చేవి కావు. ఇంతటి దారుణ పరిస్థితులు చవిచూసిన అభాగ్యులు నేడు ఎలాంటి కష్టం లేకుండా ఇంటికే డబ్బులు వస్తుండడంతో ఆనందంగా ఉన్నారు. 
 
రూ.3 వేల వరకు పింఛన్‌  
జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది అవ్వాతాతలను కలిశారు. స్వయంగా వారి ఇబ్బందులను గమనించిన ఆయన చలించిపోయారు. తాను అధికారంలోకి వచ్చాక రూ.2 వేల వరకూ ఇస్తానని ప్రకటించారు. అప్పటి వరకు కేవలం వేయి రూపాయలు మాత్రమే పెన్షన్‌ ఇస్తున్న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. ఎన్నికలకు ముందు రూ.2 వేలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అది కూడా కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేలు ఉన్న దానిని పెంచుకుంటూ రూ.3 వేలు చేశారు సీఎం జగన్‌. అర్హులందరికీ కొత్త పింఛన్లు సైతం అందేలా చేశారు.  


మంచంలో ఉన్న ఈ వృద్ధురాలి పేరు శగబండి మస్తానమ్మ. కురిచేడుకు చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. వలంటీరు ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్‌ ఇచ్చేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపేయడంతో ఆ వృద్ధురాలికి కష్టం వచ్చిపడింది. ఈనెల పింఛన్‌ అందలేదు. సచివాలయానికి వెళ్లి పింఛను తెచ్చుకోవాలని చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లే స్థితిలో లేని ఆమె ఆవేదన వర్ణనాతీతం. ‘‘ఉద్యోగులు లాగే మా ఇళ్లకు వచ్చి పింఛన్లు ఇచ్చేవాళ్లు. ఏ దిక్కూ లేని మాకు జగన్‌బాబే దిక్కయ్యాడు. ఆయన ఇస్తున్న పింఛన్‌కు అడ్డుపడుతున్న వాళ్లు మా ఇళ్లకు వచ్చి పింఛన్‌ ఇస్తారా.. మంచి చేయడం చేతకాకపోయినా చేసేవాళ్లను చెడగొట్టడం నీచమైన పని’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement