రేపు కృష్ణా జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ | Covid Vaccine Dry Run In Krishna District In Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు కృష్ణా జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్

Published Sun, Dec 27 2020 8:30 PM | Last Updated on Sun, Dec 27 2020 8:30 PM

Covid Vaccine Dry Run In Krishna District In Tomorrow - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్‌’కు రంగం సిద్ధమైంది. రేపు (సోమవారం) కృష్ణా జిల్లాలో డ్రై రన్‌ నిర్వహించనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటయ్యింది. ఐదు సెంటర్లలో పోలింగ్‌ కేంద్రం తరహాలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రక్రియ సాగనుంది. ఒక్కొక్క సెంటర్‌కు ఐదుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లను నియమించారు. ప్రతి సెంటర్‌లో ఎంపిక చేసిన 25 మంది ద్వారా డ్రై రన్ నిర్వహించనున్నారు (చదవండి: కరోనా: శూన్య సంవత్సరంగా 2020)

డ్రై రన్‌లో పాల్గొనే సిబ్బందికి శిక్షణా కార్యక్రమం పూర్తయ్యింది. లోపాలు గుర్తించి అధిగమించడమే ప్రధాన లక్ష్యంగా డ్రై రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో గురుతర బాధ్యత అప్పగించిన సంగతి  తెలిసిందే. కోవిడ్ వాక్సిన్ ‘డ్రై రన్’కి ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రేపు  వాక్సిన్ ట్రయిల్ రన్‌కు కృష్ణా జిల్లా అధికారులు సన్నద్ధమయ్యారు. (చదవండి: కొత్త వైరస్‌: ఆ లక్షణాలు కనిపించడం లేదు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement