
నాలుగేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి జోగి రమేష్ అన్నారు.
సాక్షి, కృష్ణా జిల్లా: నాలుగేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పెడన నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారన్నారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ సింహంలా సింగిల్‌గా వస్తాడు. చంద్రబాబు, దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు కలిసొచ్చినా జగన్‌ని ఏం చేయలేరు. 2024లో 151పైగా స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామని మంత్రి అన్నారు.
చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని