‘సీఎం జగన్‌ పాలనే కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు’ | Minister Jogi Ramesh Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘సీఎం జగన్‌ పాలనే కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు’

Published Thu, Nov 9 2023 3:09 PM | Last Updated on Thu, Nov 9 2023 9:07 PM

Minister Jogi Ramesh Comments On Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు కాదని.. ఒక జాతికి మాత్రమే అధ్యక్షుడు అంటూ మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన  మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయితే.. తెలంగాణలో పార్టీని ఎందుకు మూసేశారు?. అందుకే చంద్రబాబు వాళ్ల జాతికి మాత్రమే అధ్యక్షుడు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఎవరూ బయటకు రాలేదు.. వాళ్ల జాతి తప్ప మరెవరూ బయటికి రాలేదు’’ అని దుయ్యబట్టారు.

‘‘జగనన్న ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకుంటున్నాం. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండటం చారిత్రాత్మకమైన విషయం. ముక్త కంఠంతో ఈ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు’’ అని మంత్రి చెప్పారు.

సీఎం జగన్‌ పాలన మాకు కావాలి. మా పిల్లల భవిష్యత్తుకు కావాలి. మా కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎదగడానికి కావాలి. మా ఆరోగ్య పరిరక్షణకు ఔషధంలా పనిచేస్తున్న జగనన్న మాకు కావాలి. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది గడపలకు బటన్ నొక్కి డబ్బులు పంపించారు. ఆ డబ్బుతో మా కుటుంబాలు సంతోషంగా ఆర్థికంగా బాగున్నాయని ప్రతి అక్క, చెల్లి అంటున్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది సీఎం జగన్‌ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు’’ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు.
చదవండి: జగనే ఎందుకంటే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement