మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌ | CM YS Jagan Participating In Shivratri Celebrations At Gudivada | Sakshi
Sakshi News home page

మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Published Thu, Mar 11 2021 11:54 AM | Last Updated on Thu, Mar 11 2021 3:48 PM

CM YS Jagan Participating In Shivratri Celebrations At Gudivada - Sakshi

సాక్షి, గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్‌.. అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

రేపు గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్..
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సన్మానించనున్నారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల ప్రారంభంలో భాగంగా జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులను సన్మానించేందుకు శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్‌ వస్తున్నారని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటశాల సీతామహాలక్ష్మి మాచర్ల వాసి. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ గురువారం మాచర్ల వెళ్లి పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు.

 







 


 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


చదవండి:
విధుల్లో ఉన్న ఎస్‌ఐని నెట్టేసిన కొల్లు రవీంద్ర 
సీఎం జగన్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement