
ఊయల ఉరితాడై ఆ బాలుడిని కబళించింది. ఊయలకు కట్టిన చీర మెడకు బిగుసుకుని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంటి ఆవరణలోనే ఊయల ఊగుతున్న ఆ బాలుడు క్షణాల్లో ఉరితాడుకు వేళాడుతున్న విగత జీవిగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
ఉంగుటూరు (గన్నవరం): ఊయల ఉరితాడై ఆ బాలుడిని కబళించింది. ఊయలకు కట్టిన చీర మెడకు బిగుసుకుని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంటి ఆవరణలోనే ఊయల ఊగుతున్న ఆ బాలుడు క్షణాల్లో ఉరితాడుకు వేళాడుతున్న విగత జీవిగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో జువ్వనపూడి పృధ్వీరాజ్, రాణిలకు ఇద్దరు కుమారులు. గురువారం ఇద్దరు పిల్లలు ఇంటి ఆవరణలోనే ఊయల ఊగుతున్నారు.
పిల్లలు ఆడుకుంటున్నారని తల్లి ఇంటిలోపల పనిలో నిమగ్నమైంది. ఇద్దరు ఒకరి తరువాత ఒకరు ఊయల ఊగుతున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు జ్ఞానేశ్వర్ ఊయల ఊగి ఇంటిలోకి వెళ్లి బయటకు వచ్చాడు. తమ్ముడు లక్ష్మీచైతన్య(8) ఊయల చీర మెడకు చుట్టుకుని విగతజీవిలా వేలాడుతూ కనిపించాడు. విషయాన్ని తల్లికి చెప్పాడు. విగతజీవిలా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని చెప్పారు.
చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్: అత్యంత క్రూరంగా..
కోడలిని వేధించిన పాపం..!