
సాక్షి, కృష్ణా జిల్లా: తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఇసుక రీచ్ వద్ద కృష్ణా నదిలో శనివారం గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను రంజిత్, సూర్యప్రకాష్, వీరయ్య, వెంకటేశ్వరరావుగా గుర్తించారు. శనివారం కృష్ణానదిలో వేటకు వెళ్లిన నలుగురు గల్లంతయిన సంగతి తెలిసిందే. మృతులంతా కంకిపాడు వైకుంఠపురం వాసులు. ఆదివారం ఘటనా స్థలంలో సాగిన రెస్క్యూ ఆపరేషన్‌ను ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు.