కేశవ ప్రసాద్ (ఫైల్ )
మొవ్వ(కూచిపూడి): కూచిపూడి నాట్య శిఖరం, నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ (70) మృతి చెందారు. ప్రసాద్ అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలిని స్థాపించి వేల సంఖ్యలో నాట్య ప్రదర్శనలిచ్చారు. కూచిపూడిలోని కృష్ణా వర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, శ్రీ బాలా త్రిపుర సుందరీ అమ్మవారి ఆలయ ధర్మకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారు. మార్చిలో గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలో చికిత్స పొంది తిరిగొచ్చిన ఆయన మే లో కరోనా బారినపడ్డారు.
స్థానిక సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కూచిపూడి నాట్య కుటుంబంలో జన్మించిన కేశవ ప్రసాద్ బీఏ (సంస్కృతం) చేశారు. పెడసనగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలికి వ్యవస్థాపక అధ్యక్షులుగా కూచిపూడి నాట్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
చదవండి: మెడి‘కిల్స్’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం
బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే..
Comments
Please login to add a commentAdd a comment