kesava prasad
-
కూచిపూడి నాట్య శిఖరం కేశవ ప్రసాద్ కన్నుమూత
మొవ్వ(కూచిపూడి): కూచిపూడి నాట్య శిఖరం, నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ (70) మృతి చెందారు. ప్రసాద్ అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలిని స్థాపించి వేల సంఖ్యలో నాట్య ప్రదర్శనలిచ్చారు. కూచిపూడిలోని కృష్ణా వర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, శ్రీ బాలా త్రిపుర సుందరీ అమ్మవారి ఆలయ ధర్మకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారు. మార్చిలో గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలో చికిత్స పొంది తిరిగొచ్చిన ఆయన మే లో కరోనా బారినపడ్డారు. స్థానిక సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కూచిపూడి నాట్య కుటుంబంలో జన్మించిన కేశవ ప్రసాద్ బీఏ (సంస్కృతం) చేశారు. పెడసనగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలికి వ్యవస్థాపక అధ్యక్షులుగా కూచిపూడి నాట్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. చదవండి: మెడి‘కిల్స్’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే.. -
కళలతో మనో వికాసం
విజయవాడ కల్చరల్: భారతీయ సంప్రదాయ కళలలను ప్రపంచానికి చాటిచెప్పాలని నాట్యాచార్యుడు పశుమర్తి కేశవప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, విద్యాభారతి సంస్కృతీ సంస్థాన్ సంయుక్తంగా దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్యకళాశాలలో రెండురోజులుగా నిర్వహిస్తున్న భారతీయ కళల శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. విద్యార్థులు విలువలతో కూడిన జీవితం గడపాలని, దేశ భవిష్యత్ వారిమీదనే ఆధారపడివుందని, కళలు మనోవికాసాన్నిస్తాయని తెలిపారు. విధ్యాభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డీ.లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ భారతీయ కళలు భరతమాత నుదుట సింధూరపు బొట్టుగా అభివర్ణించారు. విజ్ఞానవిహర్ కార్యదర్శి మాట్లాడుతూ రెండురోజుల శిక్షణ శిబిరంలో 25 పాఠశాలలనుంచి 800 బాలబాలికలు పాల్గొన్నారని వివరించారు. పాఠశాల విద్యతోపాటు భారతీయ కళలను బాలబాలికలు అందిపుచ్చేకోవాలని సూచించారు. విద్యాభారతి కోశాధికారి గోవిందరావు భారతీయ సంప్రదాయ విలువలు, కళల గురించి ప్రసంగించారు. శిక్షణ లో పాల్గొన్న బాలబాలికలకు ప్రశంసాపత్రాలను అందించారు. విజ్ఞానవిహార్ విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో మంత్రముగ్ధుల్ని చేశారు.