
సాక్షి, కృష్ణా జిల్లా: బురద రాజకీయాలు చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏనాడైనా ఏటపాక వెళ్లారా అని ప్రశ్నించారు. తనకన్నా చంద్రబాబే పెద్దనటుడని ఎన్టీఆరే చెప్పారని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు నారా గజినీగా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. పోలవరమంటే చంద్రబాబుకు ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీనే చప్పట్లు కొట్టి మరీ చెప్పారు. చంద్రబాబుకు చిల్లర మీద ధ్యాస తప్పితే ప్రజల మీద ధ్యాసలేదని పేర్ని నాని నిప్పులు చెరిగారు.
చదవండి: దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి.. ఎవరో చెప్పిన కొడాలి నాని
Comments
Please login to add a commentAdd a comment