
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని, వంశీలను చంపుతానన్న లోకేష్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. లోకేష్, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావుపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమే చంద్రబాబు, లోకేష్ లక్ష్యం. దమ్ముంటే తండ్రీకొడుకులు గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలి. టీడీపీ సైకోలందరినీ పెట్టుకుని సభలో చెలరేగారు.’’ అని గుడివాడ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.
కాగా, నారా లోకేష్‌కి పోలీసులు షాకిచ్చారు. నిన్న(మంగళవారం) సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న నిర్వహించిన సభలో అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపుతానంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా?.. పేర్ని నాని సవాల్
వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయనను కలవనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నోటీసులు తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని పోలీసులకు కొనకళ్ల నారాయణ హామీ పత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment