AP Minister RK Roja Sensational Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

AP Minister RK Roja: ఎన్నిక ఏదైనా వార్ వన్ సైడే.. అందుకే బాబు ఫ్రస్టేషన్ పీక్స్‌ లోకి..

Published Fri, Jul 29 2022 3:22 PM | Last Updated on Fri, Jul 29 2022 4:00 PM

AP Minister RK Roja Comments On Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. శుక్రవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు, బీజేపీ, పవన్‌ కలిసి వచ్చి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. కాపులకు చంద్రబాబు చేసింది అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, అవమానాలు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడిని తరిమికొట్టాలని మంత్రి రోజా అన్నారు.
చదవండి: చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్‌

‘‘చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌లో ఉంది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అని తేలిపోయింది. ప్రజలు వైఎస్సార్‌సీపీకే మద్దతుగా నిలిచారు. ఇంకా చంద్రబాబుకి అర్ధం కావడం లేదు. సిగ్గు లేకుండా ఎన్నికలకు రావాలని సవాల్ చేస్తున్నాడు. ప్రజలు జగన్‌ను ప్రేమగా దగ్గరికి తీసుకోవడం చంద్రబాబు సహించలేకపోతున్నాడు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. జగన్ బయటికి రావడం లేదంటున్నారు. బయటికొస్తే ప్రజల్లో వస్తున్న అభిమానం చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని’’ మంత్రి రోజా  అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement