
సాక్షి, కృష్ణా : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి, పక్కా పథకం ప్రకారమే హత్యకు కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావు కాల్ లిస్ట్‌ను పరిశీలించారు. కాల్ లిస్ట్ సంభాషణలపై విచారణ చేస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావు విచారణలో చెప్పిన టీడీపీ నేతలు మరకాని వరబ్రహ్మం, జిమ్ శివ, మాదిరెడ్డి శ్రీనులకు నోటీసులిచ్చి విచారించారు. ( పక్కా ప్లాన్‌తోనే పేర్ని నానిపై హత్యాయత్నం)
ఎప్పుడు పిలిచినా స్టేషన్‌కు రావాలన్న షరతుతో విడిచి పెట్టారు. నాగేశ్వరరావు సోదరి బడుగు ఉమాదేవిని కూడా మరోసారి పిలిచి విచారించారు. నాగేశ్వరరావు నుంచి వివరాలు రాబట్టాల్సి ఉందని మూడు రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో మెమో ఫైల్ దాఖలు చేసారు.